నిన్నటి రోజున బీహార్లో మొదటి విడత పోలింగ్ పూర్తి అయ్యింది. 64.66% పోలింగ్ తో 73 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీ ఎన్డీఏ కూటమి, మహాగట్ బంధన్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ( JDU, BJP) కలిసి పోటి చేశాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్(RJD +Congress+left) ఆర్జెడి తరుపున ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో భాగంగా తేజస్విని యాదవ్ ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడిన తర్వాత బీహార్లో ప్రతి మహిళలకు ప్రతి సంక్రాంతికి రూ.30 వేల రూపాయలు జమ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ పథకానికి మాయ్ బహిన్ మాన్ యువజన అనే పేరుతో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.



 ప్రధానమంత్రి కూడా ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయల చొప్పున డబ్బులు 75 లక్షల మంది ఖాతాలో ఈ డబ్బులు వేసామని,బీహార్ మహిళలకు నవరాత్రి కానుకగా ఈ డబ్బులు ఇచ్చామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిపెట్టుకొని తేజస్విని యాదవ్ మహిళలకు తమ వైపు తిప్పుకునేందుకు రేపు వచ్చే సంక్రాంతి 14 వ తేదీన ప్రతి సంక్రాంతికి ప్రతి మహిళకు 30 వేల రూపాయలు , ప్రతి ఏడాది ఐదేళ్లపాటు  30 వేల రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని ప్రకటించారు.


ప్రతిపక్ష పార్టీలు అయిన తేజస్విని యాదవ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా డిసెంబర్ 1 నుంచి మహిళలకు ప్రతి నెల రూ.2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, అలా ఏడాదికి  రూ.30 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అలాగే రైతులకు క్వింటాకి రూ.300 రూపాయలు, గోధుమలకు రూ .400 రూపాయలు చెల్లిస్తామంటూ వెల్లడించారు. 75 లక్షల మంది మహిళలకు రూ .30 వేలు అంటే కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి అప్పుడు తెచ్చినా కూడా ఈ పథకం సాధ్యం కాదట. ఇక ఏపీలో కూడా రూ .1500 రూపాయల ప్రతి మహిళలకు ప్రతినెలా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు, అలాగే తెలంగాణలో , కర్ణాటకలో కూడా మోసం చేశారు అధికార పార్టీలు.గెలవాలని ముందైతే ఆర్భాట హామీలు ఇస్తున్నారు కాని అమలు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: