గత కొన్ని వారాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది.. కొన్ని చెదురు బదురు ఘటనల మధ్య ఎలక్షన్స్ అనేవి పూర్తయిపోయాయి. ఇదే సమయం లో గెలుపు పై రెండు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి సునీత మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని అంటున్నారు.. దాదాపుగా 50 కి దగ్గర్లో పోలింగ్ పూర్తయింది. ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా బయటకు వచ్చేసింది.. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని ఇచ్చారు.

 ముఖ్యంగా చాణక్య స్టాటజీస్ 46% కాంగ్రెస్, బీఆర్ఎస్ కి 43 శాతం, అలాగే నాగన్న సర్వే 47.84%, బీఆర్ఎస్ 41.46%, అలాగే స్మార్ట్ పోల్  48.2% కాంగ్రెస్ కి, 42.1% బీఆర్ఎస్ కి.. పీపుల్స్ పల్స్ 49% కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ 41%, వి6 వెలుగు 55% కాంగ్రెస్, 45% బీఆర్ఎస్ అంటూ ఇచ్చారు. ఇక అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని కచ్చితంగా చెప్పుకొచ్చారు. కానీ క్యూ మెగా సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ సర్వే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని అంచనా వేశారు. 45 శాతం బీఆర్ఎస్ కు వస్తాయని ప్లస్ 2 యాడ్ అవుతాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి 41% ప్లస్ 2 యాడ్ అవుతాయని చెప్పుకొచ్చారు. బీజేపీకి తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని ప్లస్ 2యాడ్ అవుతాయని చెప్పుకొచ్చారు. ఈ విధంగా బీఆర్ఎస్ దే విజయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పటి వరకు ఎక్కువ శాతం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ దే విజయం అని చెప్పారు. కానీ క్యూమెగా మాత్రం బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పడం సంచలంగా మారింది.ఇక ఎవరు గెలిచారో తెలియాలంటే కచ్చితంగా 14న ఫలితం వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: