అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని దీనిపైన దర్యాప్తు చేయాలని సూచించారు. అయితే ఈ విషయం పైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిధున్ రెడ్డి కూడా కౌంటర్ వేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్టర్ల పైన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపణల పైన తీవ్రంగా స్పందించారు ఎంపీ మిధున్ రెడ్డి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు నేరుగానే సవాల్ విసిరారు. మీరు ఆరోపణలు చేసిన తర్వాత వెనక్కి తగ్గడంలో నిపుణులని.. మీరు ఎర్రచందనం విషయంలో కూడా ఇలాంటిదే చేశారు.
మీరు హెలికాఫ్టర్ నుంచి చూపించినటువంటి భూమి మా చట్టబద్ధమైన సొత్తు.. మేము ఆ భూమిని 2000 సంవత్సరంలోని చట్టబద్ధంగా కొనుగోలు చేశామంటూ తెలిపారు. అలాగే మీరు చేసినటువంటి ఈ ఆరోపణలను కూడా నిరూపించండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దండి అంటూ హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయాలకు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి