జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.. మరి కొన్ని నిమిషాల్లో ఎన్నికల లెక్కింపు అనేది మొదలు కాబోతోంది. మొత్తం నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఉండగా కేవలం 48. 49% ఓటింగ్ మాత్రమే పోలింగ్ అయింది. మొత్తం 1 లక్ష 94,600 మంది ఓటర్లు ఓట్లు వేశారు. అలాంటి ఈ తరుణంలో మొత్తం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి వీరితోపాటు మరో 55 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉన్న గెలిచేది మాత్రం ఒక్కరే.  ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి..ఎవరు గెలుపు తీరానికి వెళ్తారు..ఎవరు రెండవ,మూడవ స్థానంలో నిలుస్తారు అనేది మరికొన్ని గంటల్లో బయటకు రానుంది.

 ముందుగా బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత 40 నిమిషాలకు ఒకసారి ఫలితాలు బయటకు వస్తాయి. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నికల లెక్కింపుకు సంసిద్ధం అవుతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి మృతి చెందడం విషాదంగా మారింది. congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40)నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. 

అయితే ఆయన నామినేషన్ ఎన్నికల అధికారులు కూడా ఓకే చేయడంతో పోటీలో నిలిచారు. మొత్తం 58 మంది అభ్యర్థుల్లో ఈయన కూడా ఒకరు. ఈరోజు ఫలితాలు రానున్న తరుణంలో ఆయన అనూహ్యంగా మరణించడం బాధాకరంగా మారింది. మరి ఈయనకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఫలితం ఏ విధంగా రాబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఈయన మరణం వారి కుటుంబంలో విషాద ఛాయలు నింపింది.. ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఫలితాలు రాకముందే మరణించాడు అంటూ కుటుంబీకులు రోదిస్తూ విలపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫలితాలు వస్తున్న సమయంలో ఇలా అభ్యర్థి మరణించడం చాలా బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: