తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత , బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా కూడా ముందు నుంచి ప్రధాన పోటీ మాత్రం బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేకన్నా కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యే హోరాహోరీగా కొనసాగుతోంది.
ఇక రెండు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే తొలి రౌండ్‌లో కాంగ్రెస్ కు 62 ఓట్లు , పోస్టల్ బ్యాలెట్ లో 3 ఓట్ల మెజార్టీ రాగా.. మూడో రౌండ్‌లో మాత్రం 1100 ఓట్లు ఆధిక్యం వచ్చింది. అయితే తొలి రెండు రౌండ్ల లో బీజేపీకి ఘోరమైన ఓట్లు వచ్చాయి. కేవలం రెండు రౌండ్లు కలిపి 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీని దారుణంగా తిరస్కరించారు అని అర్థమవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి