బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు  ఎట్టకేలకు ఈ రోజున కొనసాగుతోంది. ఈసారి బీహార్ లో అధికారం ఎవరికి దక్కుతుందనే విషయం మరి కొన్ని గంటలలో తేలిపోనుంది. మళ్లీ సీఎం గా నితీష్ కుమార్  కాయడం ఖాయమన్నట్లుగా కౌంటింగ్ ఫలితాలను చూస్తే కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ మహిళా ఓటర్ల సైతం సైలెంట్ ఫోర్స్ గా మారింది.  ఈసారి ఎన్నికలలో  66.91 % నమోదయ్యింది.  ఇంత నమోదు కావడానికి దాదాపుగా మహిళలు కీలకపాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.


243 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే చేస్తున్నారు. ఎన్డీఏ (బిజెపి+జెడియూ) 160 స్థానలలో ముందంజలో ఉన్నది. అలాగే మహాఘాట్ బంధన్ (కాంగ్రెస్+ఆర్జెడి) 75 స్థానాలలో ఉన్నది. దీంతో బీహార్ లో ఎన్డీఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటేసినట్లు కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జెన్ సూరజ్ పార్టీ కేవలం నాలుగు స్థానాలలో ముందంజలో ఉంది. దీంతో ఇప్పటికే ఎన్డిఏ గెలుపు ధీమాతో బిజెపి కార్యాలయాల వద్ద విజయోత్సవాలను నేతలు, కార్యకర్తలు సైతం చేసుకుంటున్నారు.


మహాఘాట్ బంధన్ పార్టీ కూడా గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ ఇందులో భాగంగా కార్యకర్తలకు స్వీట్లు పంచేందుకు RJD నేతృత్వంలో స్వీట్లు తయారు చేసినట్లుగా కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం ఎన్డీఏ కూటమిదే అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. మరి పూర్తి వివరాలు మాత్రం మరికొన్ని గంటలలో తెలియబోతోంది. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ను బట్టి చూసి చాలామంది అధికారం మారుతుందని రాజకీయ విశ్లేషకులు తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ మహిళా ఓటర్లకు కులం ముఖ్యం కాదు,కానీ పురుష ఓటర్లకు కులం చాలా ముఖ్యమైనది.. కానీ మహిళా ఓటర్లు ఈసారి కూడా నితీష్ కుమార్ గెలవాలని కసితో ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది దీని వల్లే రికార్డు సంఖ్యలో (NDA)స్థానాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మహిళలకు చేసిన మంచి పనుల, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి స్థాయిలో మెజారిటీ లభిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: