ఈ విజయ పరంపర చూస్తుంటే.. నితీశ్ సునామీకి అడ్డూ అదుపూ లేదని స్పష్టమైంది. మరోవైపు.. యువ నేత తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) మాత్రం 73 స్థానాలకే పరిమితమై, భారీ ఎదురుదెబ్బ తింది. మొన్నటివరకు బిహార్ పీఠం తమదే అని ధీమాగా ఉన్న విపక్ష నేతల ఆశలు.. ఈ ఫలితాలతో అడియాశలయ్యాయి. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న 'విక్టరీ పోస్ట్స!.. ఈ తిరుగులేని ఆధిక్యంతో ఉబ్బితబ్బిబ్బైన జేడీయూ నేతలు.. తమ గెలుపుపై మరింత ధీమాను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. సీఎం నితీశ్ కుమార్ వర్గానికి చెందిన నేతలు చేసిన 'ఒకే ఒక్క పోస్ట్' ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్ట్ అక్షరాలా విపక్షాల గుండెల్లో గుబులు రేపింది! "బీహార్ లో మరోసారి నితీష్ ప్రభుత్వం రానుంది.
అందుకు బీహార్ సిద్ధంగా ఉంది" – అంటూ జేడీయూ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ ప్రకటన.. తమ అధినాయకుడి విజయానికి ముందే పడ్డ ముద్రలా మారింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతూ.. ఇటు ఎన్డీయే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, అటు మహాగఠ్‌బంధన్ శిబిరంలో మాత్రం వణుకు పుట్టించింది. ఎన్నికల బరిలో నిలబడి, విమర్శల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసిన విపక్షాలకు.. ఈ ఫలితాలు, ఈ విజయ ప్రకటన గట్టి గుణపాఠం నేర్పాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు నితీశ్‌ను ఎంతగా విశ్వసిస్తున్నారో ఈ ఫలితాలే నిరూపించాయి. బిహార్ ప్రజల ఆశీర్వాదం నితీశ్ కుమార్ వెంటే ఉందని, అందుకే ఆయన మరోసారి సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారని జేడీయూ వర్గాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి ఓటేసిన బిహార్.. మళ్లీ నితీశ్ నాయకత్వంలోనే ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని ఈ సంచలన పోస్ట్, ఫలితాలు నిరూపించాయి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి