తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గత రెండు మూడు నెలలుగా తీవ్రమైన ఆసక్తి రేపిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 25 వేల ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొందరు పదేపదే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అది నుంచి చూసి రేవంత్ ను గద్దె దించి తాము ముఖ్యమంత్రి అవ్వాలని కొందరు రేవంత్ ను ఏదోలా ఇబ్బంది పెట్టాలని మరి కొందరు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫలితం వస్తే రేవంత్ పని అయిపోయింది అని ప్రచారం చేయాలని కూడా ఆశల్లో మునిగి తేలారు.
అయితే నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేయటం దగ్గర నుంచి ప్రచారం ... ప్రచారం , ప్లానింగ్ డివిజన్ల వారీగా ఇన్చార్జి మంత్రులను ఎంపిక చేయటం వరకు రేవంత్ రెడ్డి తెరవెనక అన్నీ తానే వ్యవహరించారు. ఈరోజు కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ని ఇబ్బంది పెట్టేవారు.. రేవంత్ వ్యతిరేకవర్గం వాళ్ల నోళ్లకు తాళాలు పడనున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి