ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్థీకంగా రాజకీయ వ్యూహం మారిస్తున్నారని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన తన నియోజకవర్గం పిఠాపురం ను ఆయన పూర్తి పొలిటికల్ కేంద్రస్థానంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు. పవన్ ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వహిస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి మారతారా ? అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం పవన్ 2019 ఎన్నికల్లో భీమవరం తో పాటు వైజాగ్ సిటీ లోని గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల వేళ టీడీపీ - బీజేపీతో పొత్తు నేపథ్యంలో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు ? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. పవన్ చివరకు జనసేన కు కంచుకోటగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేసి ఏకంగా 72 వేల ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. అలా తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు.
అయితే ఇప్పుడు పవన్ పిఠాపురంను తన నియోజకవర్గంగా పదిలి పరుచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసారు. ఇది పవన్ నివాస గృహం మరియు క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి వాడతారని అంటున్నారు. దీంతో పవన్ పిఠాపురంలో మొత్తం 15.52 ఎకరాల భూమి కలిగి ఉన్నట్లైంది. స్థానిక జనసేన కార్యకర్తలకు దగ్గరగా ఉండేందుకు, పిఠాపురంలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించే ఆలోచనలో కనిపిస్తున్నట్లు వినిపిస్తోంది. 216 నెంబర్ జాతీయ రహదారి దగ్గర ఉన్న ఈ భూమి ద్వారా ప్రయాణం సులువు అవుతుంది. ఇక్కడ పవన్ ఆఫీస్ కడితే జనసేనకు కంచుకోటలు అయిన ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు మధ్యలో ఉన్నట్టు ఉంటుంది.
పవన్ నెక్ట్స్ ఆలోచనల్లో కేడర్ కోసం కూడా ఓ విడిది కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పిఠాపురం లోనే పవన్ తన హౌస్ తో పాటు క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే తన రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి