ఇక ఇందులో పవన్ కళ్యాణ్ కూడా సభ్యులుగా ఉండటం ఈ నిర్ణయంపై ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే: ఇకపై ప్రతి ఏటా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు! దీనివల్ల పదోన్నతులు ఆగిపోయి, ఉద్యోగులు రిటైర్ అయ్యే దుస్థితికి ఇక ముగింపు పలికినట్టే! కొత్తగా మధ్యస్థ పోస్టుల సృష్టి, కారుణ్య నియామకాలకు ఆమోదం తెలపడం... ఉద్యోగుల పాలిట ఇది చారిత్రక ఉపశమనం! గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: క్లస్టర్ వ్యవస్థ మార్పు! .. గ్రామాల్లో పాలనను మెరుగుపరచడానికి పవన్ కళ్యాణ్ క్లస్టర్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చారు. ఇంతకు ముందు పంచాయతీల ఆదాయం ఆధారంగానే గ్రేడ్‌లు నిర్ణయించేవారు. దీనివల్ల ఆదాయం తక్కువ ఉండి, జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కొరత ఏర్పడి, పాలన గాడి తప్పేది.
ఇప్పుడు ఆదాయంతో పాటు జనాభాను కూడా పరిగణనలోకి తీసుకొని పంచాయతీలకు గ్రేడింగ్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. ఈ నూతన విధానం ద్వారా ప్రతి గ్రామానికి సరిపడా సిబ్బందిని, నిధులను కేటాయించేందుకు వీలు కలుగుతుంది. 'సిబ్బంది కొరత' అనే మాట గ్రామ పంచాయతీల్లో వినిపించకూడదని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు కేవలం ఉత్తర్వులు మాత్రమే కావు, నిర్వీర్యమైన గ్రామ సచివాలయ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి, గాంధీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యాన్ని' స్థాపించడానికి పవన్ కళ్యాణ్ వేసిన తొలి భారీ అడుగులు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి