ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పటివరకు తన మంచితనం, సహనం మాత్రమే అందరూ చూశారని కానీ ఎవరు తిరిగి పాత రాజకీయ పద్ధతులకు, దోపిడీకి మళ్ళితే తన గట్టితనాన్ని చూడాల్సి ఉంటుందంటూ నేతలను హెచ్చరించారు. దయచేసి నన్ను ఆ స్థాయికి తీసుకు వెళ్లకండి అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. క్రిమినల్ ఆటిట్యూడ్ తో ఉండే నాయకులు తమ పార్టీకి అవసరం లేదంటు డైరెక్ట్ గానే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అలాంటివారు జనసేన పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న తాను ఉపేక్షించనంటూ తెలియజేశారు.


అలాంటి వారిని వదులుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ప్రజలను మాత్రం వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. జనసేన పార్టీలో క్రమశిక్షణ, నైతికత కచ్చితంగా ఉండాలని తెలియజేశారు. 2029 లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటున్నారు , కానీ అది జరగదు అంటూ హెచ్చరించారు.. గడచిన ఐదేళ్లపాటు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని అందుకే ప్రజలు కూడా పక్కన పెట్టేశారు. అయినా కూడా వైసీపీ నాయకులలో మాటలలో కూడా ఎలాంటి మార్పు రాలేదంటే తెలియజేశారు.


ఎవరైనా ఒక పద్ధతిగా విమర్శిస్తే తప్పులను సైతం తాము సరిదిద్దుకుంటామని కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోమంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజకీయాలను చాలా దగ్గరుండి మరి గమనిస్తున్నాను తప్పులను ఎవరైనా రిపీట్ చేస్తే తాను క్షమించాను అంటూ తెలియజేశారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో అనే విషయాలను కూడా తాను గమనిస్తున్నానని.. సంక్రాంతి తర్వాత కొబ్బరి రైతుల కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసినట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. కొబ్బరి రైతులు రోడ్డున పడకుండా వారి సమస్యలను పరిష్కరించడానికి తాను వచ్చానని కొబ్బరి రైతులకు కూటమి ప్రభుత్వం అండగానే ఉంటుందంటూ భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజలు 15 ఏళ్ల పాటు కూటమి అధికారాన్ని దీవిస్తే అభివృద్ధి పూర్తి చేస్తామంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: