గత కొంతకాలంగా  ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల వాటాలపై కోర్టుల్లో వాదన నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా  సీనియర్ న్యాయవాది అయినటువంటి బ్రిజేస్ ట్రైబ్యునల్ ఎదుట చాలా ఎమోషనల్ గా అనేక వాదనలు వినిపించారు. ఇప్పటికే రాష్ట్రం విభజన కావడంతో హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకు వెళ్లిపోయింది. కొత్త రాజధాని నిర్మించుకోవాలి.. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తేవాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి ఈ టైంలో మా నీటి కేటాయింపులు కూడా తొలగించి ఇచ్చేయమని తెలంగాణ అడిగితే ఎలా  అంటూ ప్రశ్నించారు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు  ఏం పండించాలి.. ఎలా బ్రతకాలి..ఏం తినాలంటూ  కోర్టులో వాదించారు. అంతేకాకుండా 150 ఏళ్ల నుంచి అభివృద్ధి చెందినటువంటి ఆయకట్టలు ఏమైపోవాలి.. విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం ఏం చేయాలి .. అసలు ట్రైబ్యునల్ నీటి కేటాయింపులను పునః పరిశీలించే అధికారం ఎందుకు లేదనే అంశాలను మరో లాయర్ జయదీప్ గుప్తా విశ్లేషించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది.ప్రపంచ స్థాయి సంస్థలను కూడా కోల్పోయి సొంతంగా ఎదగాలని చూస్తోంది.. యువతకు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ టైంలో తెలంగాణ వచ్చి మేము ఒక పార్టీగా లేమని నీళ్లన్నీ మాకు ఇచ్చేయాలంటే ఎలా కుదురుతుంది.. అసలు ఏపీ ప్రజలు తిండి తినొద్దా అని ఎమోషనల్ గా మాట్లాడారు. గతంలో చట్టపరంగా ట్రైబ్యునల్ తీర్పులకు  అలాగే నీటి కేటాయింపులకు గుర్తింపు లేకుండా చేస్తే ఎలా  అని అడిగారు. పాత ట్రైబ్యునల్ నీటి కేటాయింపులను  తిరిగి అడగడానికి లేదు ఉమ్మడి ప్రాజెక్టుల్లో గంపగుత్తగా కేటాయించినటువంటి నీళ్లనే ప్రాజెక్టుల వారీగా ఎంతెంతో చెప్పాలి.  ఉమ్మడి ప్రాజెక్టులు కేవలం నాలుగే ఉన్నాయి..తుంగభద్ర, పులిచింతల,శ్రీశైలం, నాగార్జునసాగర్.

ఇందులో నీటి ఆవిరి కింద నష్టపోయేది ఎంతో ట్రైబునల్స్  చెప్పాయి. అలా పోయే నీటిలో ఎవరి వాటా ఎంతో తేల్చి చెప్పాలి. అంతేకాకుండా శ్రీశైలం నీటి ఆవిరి కింద నష్టపోయేది 33 టీఎంసీలు, అలాగే నాగార్జునసాగర్ లో 16 టీఎంసీలుగా ఉందని గతంలో ట్రైబునల్స్  పేర్కొన్నాయి. ఇందులోనే తెలంగాణ ఏపీ వాటాలను తేల్చి చెప్పాలి. అంతేకాకుండా నాగార్జునసాగర్ జవహర్ కాలువకు 132 టీఎంసీలు,లాల్ బహదూర్ కాలువకు 132 టిఎంసిలు ఇచ్చారు. ఇందులో లాల్ బహదూర్ కాలువకు సంబంధించి ఏపీలో 32.25 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. అలాగే నాగార్జునసాగర్ వద్ద ప్రాజెక్టుల వారిగా ఎవరి వాటా ఎంతో తేల్చాలి. విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న ఆరు ప్రాజెక్టులు హాంద్రీనీవా,వెలిగొండ, గాలేరు, తెలుగు గంగ ,నెట్టెం పాడు,నగిరి, కల్వకుర్తి  ఉన్నాయి. ఇందులో చాలావరకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే ఉన్నాయి. మిగిలిన జలాలపై అత్యంత దిగువ రాష్ట్రానికే ఎక్కువ హక్కులుంటాయి. ఈ మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ కే దక్కుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: