మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి AI తో రూపొందించినటువంటి కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరైనది కాదని, అది ఆయనను అవమానించేలా చేస్తుందని లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఫ్లకార్డు పట్టుకొని అడుగుతున్నట్లుగా ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వెంటనే నారా లోకేష్ అసంతృప్తిని తెలియజేశారు.
రాజకీయాలలో ఇలాంటి వ్యక్తిగత దూషణలకు ఎవరు పాల్పడకూడదని కేడర్ ను హెచ్చరించారు. రాజకీయాలలో గౌరవం, విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడి నిర్మాణాత్మకమైన రాజకీయాలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం సరైనది కాదు అంటూ నారా లోకేష్ తెలియజేశారు. సోషల్ మీడియాలో కార్యకర్తలు ఇలాంటివి పోస్టులు షేర్ చేయకూడదని , ఇకమీదట ఇలాంటివి జరగకూడదు అంటూ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపైన కచ్చితంగా సీరియస్గానే స్పందిస్తోంది. వారి పైన పోలీస్ కేసు నమోదు చేసి మరి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై మానిటరింగ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి