- ( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ ) . . .

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువ. అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, విడదల రజినీ, అంబ‌టి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేత‌లు రాజ‌కీయంగా పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు. లాంటి నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. అయితే వీరి నియోజకవర్గాలు సైతం గల్లంతు కావడంతోనే కనిపించకుండా మానేశారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విడదల రజిని విషయంలో ఇటీవల ఒక వార్త హల్చల్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆమెకు రేపల్లె ఇన్చార్జిగా వెళ్లాలని సూచించినట్లు ప్రచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టీ నుంచి ఆమె సైలెంట్‌గానే ఉంటున్న‌ట్టు టాక్ ? ర‌జ‌నీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు.


కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించారు. జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏకంగా మంత్రి అయ్యారు. పవర్ పాలిటిక్స్ ఎంజాయ్ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో విడదల రజ‌నీ నియోజకవర్గాన్ని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటివరకు ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కాదని గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. అయిష్టంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లిన రజనీకి దారుణ పరాజయం తప్పులేదు.


దీంతో ఎన్నికల తరువాత ఆమె చిలకలూరిపేట వచ్చేసారు. రజిని అభీష్టం మేర‌కు జగన్మోహన్ రెడ్డి ఆమెను చిలకలూరిపేటకు షిఫ్టు చేయించారు. అయితే ఇప్పుడు రేపల్లె వెళ్ళమంటున్న‌ట్టు టాక్? రేపల్లె ఇన్చార్జి పదవి ఆశించిన మోపిదేవి వెంకటరమణను వదులుకున్నారు జగన్. ఇప్పుడు అదే ప్లేస్ లోకి రజినీని వెళ్ళమంటున్నారు. ఆమె మాత్రం చిలకలూరిపేట ను విడిచిపెట్టి వెళ్లనని చెబుతున్నారు. వెళ్లాల్సిందేనని పట్టుబడుతుండడంతో రజిని పొలిటికల్ గా సైలెంట్ అయ్యార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ర‌జ‌నీ అనుకున్నంత యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌న్న టాకే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: