- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇటీవలి ఎన్నికల ముందు .. సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన నాలుగు ప్రముఖ నేతలు, ఇప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అప్పట్లో అధికార పార్టీలో రాజకీయంగా అవకాశాలు లేకపోవడంతో జనసేన తీర్థం పుచ్చుకున్న ఈ నేతలు, ప్రస్తుతం తమకు కావలసిన స్థాయిలో ప్రాధాన్యత, జాగ్రత్త లభించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని వర్గాల సమాచారం. వారు పార్టీలోకి వచ్చాక మీడియా దృష్టిలో ఉండటం తప్ప, ఇన్నాళ్లూ ఆపరేటివ్ పాత్ర ఏమీ లభించలేదన్న అస‌హ‌నం , అసంతృప్తి వారి లోపల పెరుగుతోంది. అలాగే, ముఖ్యమైన సమావేశాలు, నిర్ణయాల్లో వారికి తక్కువ ప్రాముఖ్యత ఉంద‌ని కూడా వారు లోలోప‌ల తీవ్రంగా మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌.


ఇక పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న విభజనలు, ప‌వ‌ర్ సెంట‌ర్ల‌ మధ్య యుద్ధాలు , ఈ నేతల నమ్మకాన్ని మరింత కుదించేలా చేస్తోందని సమాచారం. పైగా, స్థానిక స్థాయిలో నేతల మధ్య ఉనికి పోరు, వర్గ పోటీలు కూడా వారి ఎమోష‌న్ల‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో, పార్టీపై ఆ నేతల నమ్మకం బలహీనపడుతోంది అని, పరోక్షంగా వారు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అస‌లు వైసీపీలో నే ఉండి ఉంటే బాగుండేది .. ఐదేళ్ల పాటు క‌ష్ట‌ప‌డితే క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే సీట్లు వ‌చ్చి ఉండేవి.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి వ‌స్తే ఇక్క‌డ ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.


ఇప్పుడు జ‌న‌సేన వ‌ర్గాల్లో ఈ న‌లుగురి నేత‌ల గురించే ఎక్కువుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. జనసేన నాయకత్వం వీరి అసంతృప్తిని గుర్తించి చక్కదిద్దితే బాగుంటుంది. లేకపోతే, గతం మాదిరిగానే మళ్లీ పార్టీల మార్పులు జరుగవచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు జ‌న‌సేన వ‌ర్గాల్లో కూడా వీరు ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చు అన్న  చ‌ర్చ‌లు కూడా ఎక్కువుగా వినిపిస్తున్నాయ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: