ఆ సమయంలో రాష్ట్ర రాజకీయ వర్గాలు రెండుగా చీలిపోయాయి. నాగార్జున సైతం బాధపడ్డారనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ఘటనను పూర్తిగా మరచిపోయినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రితో చిరునవ్వుతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాలు ఒక ఎత్తు, వ్యాపారం మరో ఎత్తు అన్నట్టు నాగార్జున ప్రవర్తించారు.సమ్మిట్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఫ్యూచర్ సిటీ పరిధిలోనూ విస్తరించే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గాంధీనగర్ ప్రాంతాల్లో ఉన్న అన్నపూర్ణ సంస్థలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఒక్క రోజులోనే నాగార్జున రాక రెండు పెద్ద సందేశాలు ఇచ్చింది. ఒకటి రాజకీయ విభేదాలు వ్యాపార అవకాశాలను అడ్డుకోవని స్పష్టమైంది. రెండు తెలంగాణలో సినీ పరిశ్రమకు ఇంకా ఎంతో అవకాశం ఉందని నిరూపితమైంది.
రేవంత్ రెడ్డి కూడా నాగార్జునతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ దూరంగా ఉండరనే ధీమాను వ్యక్తం చేశారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి