బీజేపీకి ఆమని ఎందుకు కీలకం ?
ఆమని చేరిక కేవలం ఒక నటి రాక మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. హోమ్లీ హీరోయిన్‌గా, సంప్రదాయబద్ధమైన నటిగా ఆమెకు ఉన్న గుర్తింపు మధ్యతరగతి ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో సానుకూల ప్రభావం చూపుతుంది. మహిళా సమస్యలపై, వారి అభివృద్ధిపై ఆమనికున్న ఆసక్తి బీజేపీకి ప్లస్ పాయింట్ కానుంది. స్పష్టమైన తెలుగుతో పాటు, సామాజిక అంశాలపై ఆమెకు ఉన్న అవగాహన ప్రచార కార్యక్రమాల్లో పార్టీకి గొప్ప ఆస్తిగా మారుతుంది. రాజకీయాల్లో గ్లామర్ ఎప్పుడూ ఓటర్లను ఆకర్షించే అంశమే. ఆమెతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా పార్టీ వైపు చూస్తుండటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.
భవిష్యత్తు కార్యచరణ.. బాధ్యతలు :
రాజకీయాల్లోకి రావడం వెనుక "ప్రజా సేవ" మాత్రమే తన ప్రధాన లక్ష్యమని ఆమని పేర్కొన్నారు. కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా, పార్టీ అప్పగించే కీలక బాధ్యతలను స్వీకరించడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో నటిగా నా బాధ్యతను నిర్వర్తించాను. ఇప్పుడు సమాజం పట్ల ఉన్న బాధ్యతను రాజకీయాల ద్వారా నెరవేర్చాలని భావిస్తున్నాను అని ఆమన తెలిపారు. ఆమనికి రానున్న రోజుల్లో మహిళా మోర్చాలో గానీ, లేదా పార్టీ అధికార ప్రతినిధిగా గానీ కీలక పదవి దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో తన పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి, ఆమని వంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి