సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పెద్ద కొత్త ఏం కాదు. గతంలో చాలా మంది అలా వచ్చి ఇప్పుడు రాజకీయాలల్లో టాప్ స్టార్స్ అయిపోయారు. ఆ లిస్ట్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తుంది మరో స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు "ఆమని". తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు నటి ఆమని. తన సహజమైన నటనతో, భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా పలికించడంలో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా కుటుంబ కథాచిత్రాలు, భావోద్వేగ ప్రధాన పాత్రల్లో ఆమె చేసిన నటనకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.


అప్పట్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుని, వరుస హిట్లతో తన కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తమిళ దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె పేరు మాత్రం ప్రేక్షకుల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. ఇటీవల కాలంలో ఆమని గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆమని శుక్రవారం బీజేపీలో చేరారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  ఆమనికి పార్టీ కండువా కప్పి, సభ్యత్వ కార్డు అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు.



 ఇకపోతే, ప్రముఖ రాజకీయ పార్టీ అయిన బీజేపీలో ఇప్పటికే పలువురు సినీ హీరోయిన్లు చేరిన సంగతి తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పలువురు నటీమణులు ప్రస్తుతం రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆమని కూడా వెళ్లబోతుంది.  ఆమె గొంతు బీజేపీకి మంచి ప్లస్ గా మారుతుంది అంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి: