తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ మార్కు పాలన నడిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అసలు రేవంత్ రెడ్డికి పాలన చేయడం రాదు చాలా స్పీడ్ గా ఉంటారు అని చాలామంది భావించారు. కానీ మిగతావారు అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా స్పీడప్ అవ్వడం లేదు. తన మార్కు పాలన చూపిస్తూ అందరిని తన వైపు తిప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీనికి సజీవ సాక్ష్యాలు ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి కొన్ని పనులే అవేంటో ఇప్పుడు చూద్దాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు రాష్ట్రానికి సీఎం అయ్యారు.కానీ ఆయన ఏనాడు కూడా ప్రతిపక్షాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు తన సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలాంటి కేసీఆర్ పై ఇతర పార్టీ నాయకులు ఎవరైనా సరే కక్ష్య తీర్చుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కు విరుద్ధంగా చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఎలాంటి పండగలు జరిగినా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా ప్రతిపక్షాలకు ముఖ్యంగా కేసిఆర్ కు ఆహ్వాన పత్రిక అందిస్తున్నారు. హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ సీఎం అంటే ఇలా ఉండాలి అనే విధంగా మంచి పేరు తీసుకువస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ అక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి చేతిలో చేయి వేసి మర్యాదగా పలకరించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్షాలను పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడారం జాతర రెండవసారి జరుగుతుంది. మొదటిసారి జరిగినప్పుడు కూడా కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు.. ఈసారి జాతరకు కూడా ఆయన రావాలని కోరుతూ మంత్రి సీతక్క, కొండా సురేఖ వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించి కేసీఆర్ తో కాసేపు మాట్లాడారు.. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్నోసార్లు మేడారం జాతర వచ్చింది.

 కనీసం ప్రతిపక్ష నాయకులను పట్టించుకున్న దాఖలాలు లేవు.. కానీ రేవంత్ రెడ్డి ఆయన చేసినట్టు చేయకుండా కొత్తగా  అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. దీన్ని బట్టి చూస్తే  కేసీఆర్ కు ప్రభుత్వం తరఫున ప్రాధాన్యం ఇవ్వడం వల్లే  ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో సింపతి భావన ఎక్కువగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ  కేసీఆర్ ను తిడుతూ నిందిస్తూ ఉంటే కేసీఆర్ కు జనాల్లో సింపతి పెరుగుతుంది దీనివల్ల కాంగ్రెస్ పలుచబడుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా చేయకుండా చాలా ప్లాన్ తో కేసీఆర్ పై ప్రేమను చూపిస్తూ కాంగ్రెస్ ను మరింత బలంగా తయారు చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: