కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడం ఏమోగానీ సొంత పార్టీలోని నాయకులకే ఒకరికి ఒకరికి పడక ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు గొడవలు పెట్టుకున్న వివాదాలు మనం చూసాం. ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల నుండి మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం..

 తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్న వ్యాహారాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర పెత్తందారులు 20 మంది తెలంగాణ ఖజానా నుండి దోచుకుంటున్నారు. వారు ఎలా దోచుకుంటున్నారో వారికి ఇక్కడ మద్దతు ఎవరు ఇస్తున్నారు అనేది కూడా పేర్లతో సహా నాకు తెలుసు.. అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి పేరుని మెన్షన్ చేయకపోయినప్పటికీ చాలామంది మాత్రం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని తరచూ చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు అని అంటూ ఉంటారు.

అందుకే ఆంధ్ర పెత్తందారులకు మద్దతు ఇస్తుంది రేవంత్ రెడ్డే అనే పరోక్ష కామెంట్లు వినిపిస్తున్నాయి.అలాగే మంత్రి పదవి రాక అసంతృప్తితో నలిగిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే చేశారని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారా..లేక వేరే ఎవరైనా మంత్రులను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: