బాబు ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను మరియు అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తుంది. దీనికి తోడు 'బాబు' ఒడిపోయాడని ప్రతి వైసీపీ ఎమ్మెల్యే 'బాబు'ను అతి చులకనగా చూస్తూ పచ్చిగా హేళనలు చేస్తూ.. నానా హడావుడి చేస్తున్నారు. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామనే ధీమాతో జగన్ సైతం, బాబు పై మరీ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ.. బాబు పథకాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు. నిజానికి జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే చాల రకాల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. కానీ గత ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను అప్రూవ్ లు చేసిన ప్రాజెక్ట్ లను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ? పైగా బాబుని నానా మాటలు అంటూ హేళన చేయడం దేనికి ? మొత్తంగా జగన్ కి ఇది నష్టం కలిగించేదే గాని, ఏ మాత్రం లాభదాయకం కాదు. బాబు వయసు రీత్యా మరియు అనుభవం రీత్యా గౌరవింప బడాల్సిన వ్యక్తి, అయితే బాబును రాజకీయంగా ఎన్నో మాటలు అనొచ్చు.. అవసరమైతే, బాబు అవినీతి చేసాడని.. నిరూపించి జైలుకు సైతం పంపొచ్చు.
కానీ జగన్ మాత్రం గత ప్రభుత్వం చేసిన పనులను మధ్యలోనే ఆపేస్తూ.. అనవసరంగా బాబుని దూషిస్తూ.. అవమానిస్తూ ప్రజల్లో తనకున్న విలువను జగన్ తగ్గించుకుంటున్నారు. దీనికి తోడు తన నాయకుల చేత నానా మాటలు అనిపిస్తున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే బాబును తిడుతూ నోరు జారాడు. అయినా అసలు బాబును ఎందుకు తిడుతున్నాడో కూడా ఆ ఎమ్మెల్యే చెప్పలేదు. ఇది మరి దారుణం. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇలా అర్ధం పర్ధంలేని తిట్లతో తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు వైసీపీ వాళ్లు. ఈ మధ్య ఓ ఎమ్మెల్యే బాబు తమ ప్రభుత్వం పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. తమకు చెడ్డపేరు వచ్చేలా బాబు వ్యాఖ్యలు ఉంటున్నాయని తీవ్రమైన పదజాలంతో హెచ్చరించాడు ఆ ఎమ్మెల్యే. అసలు ఎవరి ప్రభుత్వానికి ఎవరు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. స్వయంగా వైసీపీ నాయకులే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారే తప్ప.. వేరే ఎవరి వల్ల చెడ్డ పేరు రావట్లేదు. ఇప్పటికైనా వాళ్ళూ మారితే జగన్ కే మంచింది.