ఎప్పటికపుడు పొత్తులు, ఎత్తులు మార్చేసే గండర గండడు చంద్రబాబుని కాంగ్రెస్ నిజంగా నమ్ముతోందా. అసలు బాబు వ్యూహాలను ఆ పార్టీ పెద్దలు కనిపెడుతున్నారా. బాబు అంటే వారిలో తెలియని భయం ఉందా. తమ జాగ్రత్తల్లో ఉంటున్నారా అంటే పరిస్తితులు చూస్తే అవుననే ఆన్సర్ వస్తుంది.  మోడీని ఒక్కసారిగా వదిలేసి బాబు హఠాత్తుగా ఇటు వైపు ప్లేట్ ఫిరాయించినా టైం వస్తే మళ్ళీ ఎటైనా వెళ్ళగలన్నది హస్తం పెద్దలకు తెలియంది అనుకోలేం.


అక్కడే తెలిసిపోతోంది :


నిజానికి ఓ నాడు ఉమ్మడి ఏపీని ఏలిన పార్టీ, తెలంగాణాను 1994లో స్వీప్ చేసిన పార్టీ, ఇప్పటికీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ, అటువంటి టీడీపీకి డజన్ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పెద్దలు ఖరాఖండీగా   అంటున్నారంటే వారికున్న  భయాల వల్లనేనని  తెలుస్తోంది. ఇన్ని సీట్లు ఇఛ్చేస్తే రేపటి రోజున గెలిచిన తరువాత బాబు ఎలా అడ్డం తిరుగుతారో అన్న డౌట్స్ ఉండబట్టే పక్కన పెడుతున్నారని అంటున్నారు.


ఏమైనా చేయగలడు :


చంద్రబాబు పార్టీ అక్కడ 35 నుంచి 40 సీట్లు డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం 12 కంటే మించి ఇవ్వలేమని చెబుతోంది. మరి ఇది చాలా అవమానకరమైన ప్రతిపాదన. పోయిన ఎన్నికల్లో కూడా టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. పైగా చాలా  చోట్ల రెండవ స్థానంలో కూడా ఉంది. అటువంటి పార్టీకి ముష్టి వేసినట్లుగా డజన్ సీట్లేంటన్న వాదన వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వంటి వారైతే ఇదే చాలా  ఎక్కువన్నట్లు మాట్లాడుతున్నారు. పొత్తులెందుకని కూడా పాయింట్లు తీస్తున్నారు. బాబును నమ్మలేమని కూడా బాంబులు పేలుస్తున్నారు.



ఇంకో వైపు ఏకంగా రాహుల్ గాంధీ అయితే  మనం గెలిచే సీటు ఒక్కటీ వదలద్దు, మిగిలినవి ఉంటే పొత్తుల్లో ఇచ్చేయండని ఆర్డర్ వేశారు. మహిళా  నాయకురాలు డీకే అరుణ అయితే టీడీపీకి రూరల్ జిల్లాలో ఒక్క సీటూ ఇవ్వద్దని చెబుతున్నారు.  ఇలా తలో విధంగా ఉన్న కాంగ్రెస్ పాటీతో నెగ్గుకురావడం టీడీపీకి అంత సులువు కాదు. మొత్తానికి బాబుని నమ్మని పరిస్థికి అక్కడ ఉంది. అవమానాలు అపుడే షురూ అయిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: