ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.  గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

 

- మనసులో అసూయ, ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. 

- ఏ పని చక్కగా చేయాలన్నా........ ముందు ఆ పనిలో ఆసక్తి ఉండాలి. 

- నోట జారిన మాట, చేజారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. 

- ఏ పరిస్థితుల్లో ఉన్నా..... నీ కర్తవ్యం నీకు గుర్తుంటే ......... జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. 

- పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే....... అవి జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. 

- మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు!

- మన శక్తిని తెలియజేసేది .... మన సామర్థ్యం. మనము ఏం చేయగలమో తెలిపేది. ఆత్మవిశ్వాసం. మనమేంటో నిర్ణయించేది........ మన వ్యక్తిత్వం. 

- చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. 

- వినడానికి కటువుగా ఉన్నా ...... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 

- మన లోపాలను మనం తెలుసుకోవడమే అన్నింటికన్నా పెద్ద చదువు. 

- సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం. 

- చిన్న విషయమే కదా అని దేనినీ తేలికగా తీసుకోకూడదు. అతి పెద్ద ఓడను కూడా ఓ చిన్న రంధ్రం నిలువునా ముంచేస్తుంది. 

- ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: