ప్రస్తుత కాలంలో చదువుకున్నవారు ఎక్కువవుతున్నారు..ఇందుకు కారణం చదువు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే నేర్పించలేదు.. విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరిని బాగా చదువుకోవాలని సూచిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు.. ఒకవేళ చదువుకోకుండా కూడా మేము డబ్బు సంపాదించగలము అని అనుకుంటే మాత్రం ఇది చాలా పెద్ద తప్పు.. కేవలం డబ్బు మాత్రమే జీవితాన్ని సాగించలేదు. అందుకు తగ్గట్టు లోకజ్ఞానం కూడా  తెలిసి ఉండాలి. ఎప్పుడైతే లోక జ్ఞానం లేకుండా ఉంటామో, అప్పుడే ఎంత డబ్బు సంపాదించినా కూడా వృధా అవుతుంది.


సంస్కారం, లోక జ్ఞానం, విజ్ఞానం, ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న నూతన మార్పులు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే, మనం ఖచ్చితంగా చదువుకొని ఉండాలి.. ఇక కేవలం వీటిని తెలుసుకోవడానికి మాత్రమే మనం చదువుకొని ఉండాలా.. అంటే మాత్రం కాదు.. మన కడుపు నింపుకోవడానికి కూడా చదువు చాలా అవసరం.. పదిమంది చదువు లేని వాళ్ళు ఉన్నా, వారు చేయలేని పనిని ఒక్క చదివిన వాడు మాత్రమే చేస్తాడు అనడంలో  ఎలాంటి సందేహం లేదు..


ఇక ప్రపంచాన్ని మార్చే ఆయుధం కేవలం చదువు మాత్రమే.. చదువుకున్న వాడికి టెక్నాలజీ బాగా తెలుస్తుంది. దేనికోసం దేనితో తయారు చేయాలి..? దేనిని ఎలా ఉపయోగించాలి.. ఉపయోగించిన దానిని వృధా చేయాలా.. లేక తిరిగి ఉపయోగించాలా.. ఇలా ఇవన్నీ కూడా ఆలోచించగలిగే సామర్ధ్యం ఉన్నది కేవలం చదువుకున్న వాళ్లకు మాత్రమే.. అయితే  చదువు లేని వాళ్ళు ఏ పని చేయలేక పోతున్నారా..వాళ్ళు ఆనందంగా జీవించలేక పోతున్నారా..అనే ప్రశ్నలు కూడా చాలామందిలో తలెత్తుతూ ఉంటాయి.. కానీ చదువుకోని వాడు పడే తిప్పలు,వాడికి మాత్రమే అర్థం అవుతాయి..


డబ్బు సంపాదించాలన్నా, ఆ డబ్బును దాచి పెట్టుకోవాలన్నా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను పొందాలన్నా ఎంతోకొంత చదువుకొని తీరాలి. అప్పుడే చదువుకున్న వాళ్ళు ఒక నవ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. సరి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఆధునికత పుట్టుకొస్తుంది.. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అన్న ఒక్క ఆలోచనతోనే మీ ముందుకు వచ్చాము..


మరింత సమాచారం తెలుసుకోండి: