మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీలో కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి. లేదా ఇవన్నీ తెలియపరచండి ఒక నాయకుడు కావాలి. నాయకుడు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో, ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకువస్తాడు .. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే.. నాయకుడంటే నమ్మదగినవాడు కానీ నమ్మించే వాడు కాదు..!
నాయకత్వ లక్షణాలలో అనుకూలత ఒకటి. ఒక నాయకుడు జట్టు సభ్యుల సహజ ప్రతిభను కనుకోవాలి.
నాయకులలో గొప్పవారు తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండి నేర్చుకోవాలి, అది ఎదగడానికి ఒక భాగం. వైఫల్యాల నుండి నేర్చుకోవడం మిమ్మల్ని విజయానికి దారి తీస్తుంది.నాయకుడి పాత్ర ఏంటంటే ప్రపంచ మరియు సమగ్ర దృష్టిని ప్రసారం చేయడం, సమూహంలో విశ్వాసం చూపడం, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రజలను మార్గనిర్దేశం చేయడం అలాగే సమీకరించడం. ఇంక పని అంతటా ఎదురయ్యే అవరోధాలు అలాగే సంక్షోభాలు ఉన్నప్పటికీ సమూహం యొక్క ఆసక్తిని ప్రోత్సహించడం మరియు నిర్వహించడం. సంఘటనలను బలోపేతం చేయడం అలాగే అవసరమైనప్పుడు విచలనాలను సరిచేయడం . అదేవిధంగా, నాయకుడు తన సిబ్బంది యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి మరియు ప్రతి ఒక్కరికి విధులను పంపిణీ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఒక నాయకుడిగా మారుతాడు...
కానీ ప్రస్తుత కాలంలో నాయకులు అంటే నమ్మదగినవారు కాదు నమ్మించే వారిగా వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తామంటూ తిరిగి వారికి ఎలాంటి సహాయం చేయకపోవడం వంటి పనులు చేస్తున్నారు.. ప్రజలు కూడా నాయకులను ఎన్నుకోవడంలో శ్రద్ధ చూపించాలి. నిజమైన నాయకుడు ఎవరో తెలుసుకొని మరీ ఎన్నుకోవడం ఉత్తమం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి