అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ ఎంతో సంతోషంగా కలసి మెలసి ఉండేవి..అక్కడ జింకలు ,కుక్కలు, కోతులు, పాములు,కోతులు, మేకలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో సంతోషంగా కలసి మెలసి జీవిస్తూ ఉండేవి.అయితే అందులో ఒక పాము కూడా వుండేది.అది మిగతా జంతువులతో కలిసి జీవిస్తున్నట్లు నటిస్తుండేది. అయితే ఆ పాము తన ఆకలి తీర్చుకోవడానికి వాటితో కలసి సంతోషంగా ఉన్నట్లు నమ్మించి , ఎవరూ లేని చోట వాటిని చంపి తినేస్తూ ఉండేది.


అలా కాలం గడిచేకొద్దీ అడవిలో నివసిస్తున్న జింకలు, దుప్పిలు, కుందేళ్ళు ఇలా మాయ మవ్వసాగాయి. ఇది గమనించిన జంతువులన్నీ ఒకచోట సమావేశమై ఇలా అనుకోవడం మొదలుపెట్టాయి. మనతో పాటు కలిసి జీవించే ఎన్నో జంతువులు రోజుకొకటి చొప్పున మాయమవుతున్నాయి. కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు.. అని ఒక జింక అడిగింది.. అప్పుడు ఏనుగు ఏ పులో, సింహమో వేటాడుతున్నట్టుంది అని చెప్పింది. అప్పుడు  పాము కూడా ఏమీ తెలియని నంగనాచిలా వచ్చి, అవును ఆ పులులు , సింహాలు పనే  అయి ఉంటుంది అన్నది. ఇక ఆ రోజు నుండి జంతువులన్నీ అప్రమత్తంగా ఉండ సాగాయి.

కానీ ఆ పాము మాత్రం తన దుర్భుద్ధి ని వదులుకోలేక పోయింది. ఒంటరిగా ఉన్న జంతువులను  పట్టి, మింగేసి ఒక చెట్టుకు చుట్టుకొని, కడుపులో అది అరిగాక మళ్లీ మామూలు స్థితికి వచ్చేది. పాపం జంతువులన్నీ ఎవరు చేస్తున్నారో తెలియక హడలిపోయాయి. అయితే అనుకోకుండా ఒక రోజు జింక పామును చూసింది. ఆ సమయంలో ఆ పాము కుందేలును మింగుతోంది. ఇది చూసిన  జింక మా మధ్య తిరుగుతూ మమ్మల్ని మోసం చేస్తున్నావా నీపని చెప్తానుండు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

జింక ఈ విషయాన్ని అడవి రాజైన సింహానికి చెప్పింది. సింహం.. పామును విచారణకు పిలిపించాడు. అడవిలో ఉన్న జంతువులు అన్నీ మాయం అవ్వడానికి కారణం నువ్వే అని నిరూపణ అయ్యింది.. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు ..నీకు మరణదండనే శిక్ష అని చెప్పింది. ఇక మిగతా జంతువులన్నీ ఆ పాము మీద దాడి చేసి దానిని చంపేశాయి. కాబట్టి ఎప్పటికైనా నమ్మినవారిని నమ్మకద్రోహం చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: