అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పొదలు ఉండేవి. జింకలు ,దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. ఇక అదే అడవిలో అత్యాశగల ఒక నక్క ఉండేది.


ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఎంత దూరం వెళ్లినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదు. నిరాశ చెందక మరికొంత దూరం ముందుకు నడిచింది. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్కలను నోట కరుచుకొని బయలుదేరింది. మరి కొద్ది దూరంలో దానికి మరో మాంసం ముక్క కనిపించింది.  


ఆహా ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకుంది. నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతలి ఒడ్డుకు చూసింది. దానికి ఆవలి ఒడ్డున చచ్చి పడి ఉన్న జింక కనిపించింది
     

దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతలివైపు కు ఈద సాగింది. నోట్లోని మాంసం ముక్కలు నీళ్లలో పడిపోయాయి. ఈ ముక్కలు పోతే పోయాయి అవతలివైపు చచ్చిపడి ఉన్న జింక ఉంది కదా!"అని నది దాటి వెళ్లింది. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటు వైపుకు ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక ముసలి ఉంది. ఆ ముసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరకు రాగానే అమాంతం దానిపై పడి దానిని దాని నోటి లోని జింకను తినేసింది.


కాబట్టి మనిషి కి అయినా మరే ఇతర ప్రాణులకు అయినా సరే  ఆశ ఉండాలి .. ఉంటేనే జీవితంలో ముందడుగు వేయడం కానీ అత్యాశ పనికిరాదు. అత్యాశ కారణంగా జీవితంలో సంతృప్తి లేక ఇంకా కావాలి అని ..ఒక ఆలోచన ముందుండి మన జీవితాన్ని నాశనం చేస్తుంది.. ఇంకా కావాలి అనే పదాన్ని పక్కనపెట్టి .. ఇది సరిపోతుంది అనే పదం తో జీవితాన్ని కొనసాగిస్తే చక్కగా జీవితంలో ఎన్నో సాధించవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: