భారత క్రికెట్ లో కేఎల్ రాహుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో కీలక ఆటగాళ్లు కొనసాగుతున్నాడు కె.ఎల్.రాహుల్. అయితే భారత క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో  వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెటర్ల లవ్ మేటర్ అయితే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. గత కొంతకాలం నుంచి  రాహుల్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని  గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది  వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ కలిసి ప్రత్యక్షం అవుతూ ఉండడం జరుగుతుంది  పబ్బులు, పార్టీలకు వెళుతూ ఉండటం చూస్తుంటే.. ఇక వీరు ప్రేమలో ఉన్నారు అని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం కేఎల్ రాహుల్  టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లాండ్ లో ఉన్నాడు. అయితే కె.ఎల్.రాహుల్ ప్రేయసి అతియా శెట్టి ఆమె సోదరుడు కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  దీంతో కేఎల్ రాహుల్ తో పాటు అతియా శెట్టి కూడా ఇంగ్లాండ్ వెళ్ళింది అన్న ప్రచారం మొదలైంది. భారత క్రికెటర్లకు వారితో పాటు వారి భాగస్వాములను కూడా ఇలాంటి పర్యటనకు తీసుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.



 ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ ఇక తన ప్రేయసి అతియా శెట్టి ని తనతో పాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కె.ఎల్.రాహుల్ అతియా శెట్టి జంట గురించి అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది అతియా శెట్టి. కే ఎల్ రాహుల్ ఇద్దరూ కూడా ఎంతో చూడ చక్కనైన జంట.. అందుకే వాళ్లు నటించిన యాడ్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది ఇక వారి మధ్య రిలేషన్ షిప్ గురించి అంటారా ఈ విషయం వారిని అడిగితే సరిపోతుంది కదా అంటూ సునీల్ శెట్టి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారిపోయింది. కే ఎల్ రాహుల్ అతియా శెట్టి  పెళ్లి కి సునీల్ శెట్టి ఇక అంగీకరించినట్లే అని అంటున్నారు నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: