ఒకప్పుడు భారత క్రికెట్ లో కీపర్గా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించుకున్న దినేష్ కార్తీక్  కు మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి వచ్చిన తర్వాత మాత్రం కెరియర్ అయోమయంలో పడిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ కీపర్ గా బ్యాట్మెన్గా కూడా అద్భుతంగా రాణించడంతో అప్పటివరకు కీపర్ గా ఉన్న దినేష్ కార్తీక్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్లో రాణించక పోవడంతో ఇక టీమిండియాలో స్థానం కోల్పోయాడు. చాలా సార్లు దినేష్ కార్తీక్ కు జట్టులో అవకాశం కల్పించినప్పటికీ తనని తాను నిరూపించుకోలేక  పోయాడు. దీంతో భారత జట్టులో చోటు దక్కడం  దినేష్ కార్తీక్ కు చాలా కష్టం గానే మారిపోయింది.



 ఇక ఆ తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతూ వచ్చాడు దినేష్ కార్తీక్. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించ పోతున్నాడు అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై  దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని మళ్లీ టీమిండియా లోకి పునరాగమనం చేసి రాణించాలనే కసి ఇంకా ఉంది అంటూ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సీనియర్ ప్లేయర్  ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం  నాకు ఇంకా క్రికెట్ ఆడాలని ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ టి20 లలో రాణించాలని ఉంది. ఇక భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా రగులుతూనే ఉంది  అదే నా అల్టిమేట్ గోల్ అంటూ దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు.


 ఇక భారత జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తున్నాను. మూడేళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నా అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ మీద ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టే ఇప్పటికీ దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నా.. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ లాంటి దేశవాళి టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతంగా ముందుకు నడిపించా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీ20ల్లో ఫినిషర్ గా మళ్లీ పునరాగమనం చేయాలని అనుకుంటున్నాను అంటూ మనసులో మాట బయటపెట్టేసాడు దినేష్ కార్తీక్  గత ఏడాది కామెంట్రీ చేయడం పై స్పందించిన దినేష్ కార్తిక్ కి కూడా తన కొత్త పాత్రను ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. మూడేళ్ళ వరకూ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి: