కొడుకు కోసం తండ్రి ఉద్యోగం వ‌దులుకున్నాడు. టీం ఇండియాలో చోటుకోసం పెద్ద ప్ర‌య‌త్న‌మే చేశాడు.క‌ఠోర శ్ర‌మ చేశాడు. చివ‌రికి సాధించాడు ఆ కుర్రాడు. పేరు ర‌షీద్ .. పూర్తి పేరు షేక్ ర‌షీద్.. వాళ్ల నాన్న పేరు షేక్ వలీషా అలీ.ఇవాళ ఆ కుర్రాడు వాళ్ల నాన్న క‌ల తీర్చాడు. దేశానికి గ‌ర్వ కార‌ణం అయి నిలిచి ఆంధ్రోడి స‌త్తా చాటాడు. మ‌ళ్లీ సెబ్బాస్ రా!



నిన్న‌టి వేళ టీం ఇండియా క్రికెట్ టీం విజ‌య దుందుభి మోగించింది.నిన్న‌టి వేళ అండ‌ర్ 19 విభాగంలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ అన్న‌ది మ‌న‌ల్ని విశ్వ‌విజేత‌ల‌ను చేసింది. ఆ ఆట‌లో ఇంగ్లాండ్ పై మ‌న కుర్రాళ్లు చెల‌రేగిపోయారు.ఫ‌లితంగా విజ‌యం మ‌న‌ల్ని వ‌రించింది. ఈ చారిత్రక విజ‌యం న‌మోదులో మ‌న తెలుగు కుర్రాడు కూడా ఉన్నాడు. టీం ఇండియా గెలుపున‌కు ఎంత‌గానో కృషి చేసి అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటున్నాడు. కుర్రాడంటే మామూలు కుర్రాడు కాదు చిచ్చ‌ర పిడుగు. మిర్చి లాంటి కుర్రాడు. అవును వాళ్ల ఊరు గుంటూరు. (ప‌త్తిపాడు మండ‌లం,మ‌ల్ల‌య్య‌పాలెం).ప్ర‌స్తుతం ఇంట‌ర్ చదువుతూ ఆట‌ల్లో రాణిస్తూ మంచి పేరుకు కేరాఫ్ అవుతున్నాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ సెబ్బాస్ రా!

ఇంట‌ర్ చ‌దువుతున్న ర‌షీద్ ఎవ‌రో తెలుసా..మ‌న తెలుగోడు..మ‌న గుంటూరోడు.మిర్చి లాంటి కుర్రోడు. టీం ఇండియాను గెలిపించి నోడు.టీం ఇండియా అండ‌ర్ 19 క్రికెట్ టీం కు వైఎస్ కెప్టెన్.నిన్నటి వేళ టీం ఇండియా గెలుపున‌కు కీల‌కం అయ్యాడు. సెమీస్ లోనూ ఫైన‌ల్స్ లోనూ రాణించాడు. సెమీస్ లో 94 ప‌రుగులు చేసి సెంచ‌రీ చేజార్చుకున్నా ఆత్మ నిబ్బ‌రం కోల్పోడు. పైన‌ల్స్ లో ఆఫ్ సెంచ‌రీ చేసి జ‌ట్టు విజ‌యానికి మ‌ళ్లీ దోహ‌దం అయ్యాడు. మ‌న కుర్రాడు ఇవాళ దేశం అంతా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లే కావాలి ఈ దేశానికి.. దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపేవాళ్లు కావాలి.దేశానికి విజేత‌లు కావాలి. ర‌షీద్ లాంటి కుర్రాళ్లే కావాలి.

జాతీయ,అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో రాణించేవాళ్లే కావాలి.ర‌షీద్ ఇప్ప‌టికే చేశాడు.అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడు వంద‌ల‌కు పైగా ప‌రుగులు చేసి త‌న సత్తా చాటాడు. పిల్ల‌లూ! మీరు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ప‌నికిమాలిన వీడియో గేమ్ ల‌తో కాలం గ‌డ‌ప‌కండి. ర‌షీద్ గెలిస్తే మ‌న దేశం గెలిచింది. తెలుగు వాడి గొప్ప‌ద‌నం అంతా గుర్తించింది. ఇలాంటి వాళ్లే కావాలి దేశానికి..ఖాళీగా తిని కూర్చొనే యువ‌త కానే కాదు. పిల్ల‌లూ ! వింటున్నారా!

మరింత సమాచారం తెలుసుకోండి: