గత సంవత్సరం వరకు కుల్దీప్ యాదవ్ కోల్కతా టీమ్ లో ఉన్నాడు. కానీ అప్పటి కెప్టెన్ గా ఉన్న మోర్గాన్ అస్సలు ఐపీఎల్ సీజన్ 14 లో ఆడించనే లేదు. ఒకటి రెండు అవకాశాలకే సరిపెట్టారు. దీనితో కుల్దీప్ యాదవ్ పని అయిపోయిందని అంత అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన రీటెన్షన్ పద్దతిలో కోల్కతా కుల్దీప్ ను వేలానికి వదిలేసింది. అంతే కాకుండా అంతర్జాతీయ అనుభవం ఉన్న కుల్దీప్ యాదవ్ ను మెగా వేలంలో కూడా కేకేఆర్ కొనుగోలు చేయకుండా పెద్ద తప్పు చేసింది. అయితే చేసిన తప్పును ఇప్పుడు కేకేఆర్ అనుభవిస్తోంది. రిటైన్ చేసుకున్న స్పిన్నర్లు నరైన్ మరియు వరుణ్ చక్రవర్తి పూర్తిగా విఫలం అయ్యారు.

ఈ రోజు ఢిల్లీ మరియు కోల్కతా ల మధ్య జరిగిన మ్యాచ్ లో అతనే వీరికి శత్రువు అయ్యాడు. ఆరంభం లోనే వికెట్లు పడినా శ్రేయాస్ మరియు నితీష్ రాణాలు ఇన్నింగ్స్ ను కుదుటపడేలా చేయడానికి ప్రయత్నించారు. అయితే కుల్దీప్ విజృంభించి వరుసగా బాబా ఇంద్రజిత్, నరైన్, శ్రేయస్ మరియు రస్సెల్ లను పడగొట్టి పాత టీమ్ పై తన పగను తీర్చుకున్నాడు. కుల్దీప్ వేసిన బంతులకు వీరి దగ్గర సమాధానం లేకుండా పోయింది. కుల్దీప్ దాటికి ఒక దశలో ౯౦ పరుగుల లోపే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. కానీ నితీష్ రానా మరియు రింకు సింగ్ లు సరైన సమయంలో చివరి మూడు ఓవర్ లు ధాటిగా ఆడి స్కోర్ ను 146 పరుగులకు చేర్చారు.


అయితే ఈ పిచ్ పై ఈ స్కోర్ ఛేదించడం అయితే కష్టం కాదు. కానీ ఏ విధంగా కోల్కతా ఈ స్కోర్ ను కాపాడుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. మరియు ఢిల్లీ బ్యాట్స్మన్ ఉమేష్ యాదవ్, నరైన్ లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: