ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్  ఎంత ఆసక్తికరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢిల్లీ జట్టు అటు ప్రత్యర్థి కోల్కతాపై బ్యాటింగ్లో బౌలింగులో పూర్తి ఆధిపత్యం సాధించింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకు అటు కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ మొత్తం చేతులెత్తేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. అయితే సాధారణంగా ఐపీఎల్లో బౌలర్లు ఏదైనా కీలకమైన వికెట్లు తీశారు అంటే సంబరాలు చేసుకుంటారు. ఇక తమదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక వింత సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న చేతన్ సకారియా తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మూడు ఓవర్లు వేసిన 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు కీలకమైన ఫించ్ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఆరోన్ ఫించ్ ని క్లీన్ బౌల్డ్ చేసిన సమయంలో చేతన్ సకారియా చేసుకున్న సెలబ్రేషన్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇన్ స్వింగర్  బంతిని విసిరిన చేతన్ సకారియా ఆరోన్ ఫించ్ ను  క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే ఇలా వికెట్ పడగొట్టిన ఆనందంలో ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ సిరీస్ డ్రాగన్ బాల్ జెడ్ లోని గోకు స్టైల్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉండగా నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు చేతన్ సకారియా. కానీ ఈ ఏడాది మెగా వేలంలో అతని వేలం లోకి వదిలేసింది రాజస్థాన్ జట్టు. దీంతో ఢిల్లీ 4 కోట్లకు అతని దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: