
ఈ క్రమంలోనే అంపైర్ల తప్పుడు నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా అంపైర్లు మాత్రం అంతకుముందు కంటే కాస్త ఎక్కువగానే తప్పిదాలు చేస్తూ ఎంతో మంది క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. అయితే ఆసియా కప్లో ఇలాంటిది ఎక్కడా జరగకూడదు అని అభిమానులు కోరుకున్నారు. కానీ మొదటి మ్యాచ్లో ఇలాంటి ఒక తప్పిదం జరిగింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీలంక ఇన్నింగ్స్ రెండు ఓవర్ సమయంలో వేసాడు నవీన్ ఉల్ హాక్ బౌలింగ్లో బంతి బ్యాట్స్మెన్ బ్యాట్ కు దగ్గరగా వెళుతూ వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. దీంతో వికెట్-కీపర్ క్యాచ్ను పట్టుకుని గట్టిగా అప్పీల్ చేశాడు. ఇక అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే అవుట్ అంటూ వేలు పైకి ఎత్తాడు. ఇక ఆ తర్వాత నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న గుణతిలక తో చర్చించి రివ్యూ కి వెళ్ళాడు. అయితే రిప్లైలో బంతి బ్యాట్ దాటే సమయంలో ఎటువంటి స్ట్రైక్ కనిపించలేదు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అవుట్ అంటూ ప్రకటించాడు. దీంతో మైదానంలో ఉన్న బ్యాట్స్ మెన్ తో పాటు డగౌట్ ఉన్న మిగతా సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అంపైర్ కి కళ్ళు కనిపించడం లేదా అంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..