భారత్ ,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం  క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ఈ దాయాదుల పోరులో ఎవరు ఎలా రాణించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో అయితే సూర్య కుమార్ సృష్టిస్తున్న బ్యాటింగ్ విధ్వంసం అంత ఇంత కాదు.. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.


 అతని అద్భుతమైన ఆట తీరుతో గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ హాట్ టాపిక్గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక సూర్యకుమార్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో ఆ జట్టు బౌలింగ్ విభాగాన్ని ఎలా ఎదుర్కొంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే విషయం పై స్పందించిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సోహెల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. అన్ని మ్యాచ్ల్లో చెలరేగుతున్న సూర్య కుమార్ పాకిస్తాన్ తో మ్యాచ్లో విఫలం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నేను పాకిస్తాన్ బౌలర్ల గురించి మాట్లాడుతున్నాను. పాక్ బౌలింగ్ లైన్ అప్ ఎంతో బలంగా ఉంది. ఇక భారత జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. ఇలాంటి సమయంలో నేను పాకిస్తాన్ కెప్టెన్ అయ్యుంటే నా ముందు సూర్య కుమార్ లేదా ఇంకెవరు పేరు ప్రస్తావించిన పెద్ద ఇబ్బందిగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వివ్ రిచార్డ్స్ మాదిరిగా అందరూ అద్భుతమైన ప్రదర్శన చేయలేరు.  సూర్యకుమార్ కూడా అందరు ఇలాంటి వాడే. నా దృష్టిలో మాత్రం కోహ్లీ డేంజరస్ ప్లేయర్, రోహిత్ కూడా అంటూ అమీర్ సోహెల్ షాకింగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: