టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల సూపర్ 12  ల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ఇక ప్రేక్షకులు ఊహించిన దానికంటే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు చివరి బంతి వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి భారతదేశ జట్టు విజయ డంకా మోగించింది అని చెప్పాలి. గత ఏడాది పాకిస్తాన్ చేతిలో ఓటమికి ఈ ఏడాది వరల్డ్ కప్ లో దెబ్బకు దెబ్బ కొట్టింది టీమిండియా జట్టు.


 ముఖ్యంగా కీలకమైన డెత్ ఓవర్లలో అయితే ప్రేక్షకులందరికీ ఊహకుందని రీతిలో హై డ్రామా నెలకొంది అని చెప్పాలి . భారత జట్టు విజయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు ఇక ఈ మ్యాచ్ చుట్టూ నోబాల్ వివాదం మాత్రం చాలా రేగుతూ ఉంది. ఇండియా ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. ఇక మొదటి బంతికి హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఐదు బంతుల్లో 16 పరుగుల గణాంకాలు వచ్చాయి. ఇక నాలుగో బంతికి విరాట్ కోహ్లీ ఫైన్ లెగ్ దిశలో సిక్స్  కొట్టాడు. అప్పుడు ఎంపైర్ నోబాల్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ నోబాల్ కోసం అంపైర్ను అడగగా.. ఇద్దరు ఎంపైర్లు కాసేపు విషయంపై చర్చించుకుని లెగ్ ఎంపైర్ నోబాల్ గా ప్రకటించాడు.


 ఆ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  ప్రశ్నించిన ఫలితం లేకుండా పోయింది.  ఇక ఈ నోబాల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది అని చెప్పాలి. అయితే నో బాల్ పై షోయబ్ అక్తర్  అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక అంపైర్ల నిర్ణయం పై సెటైర్లు వేశాడు. విరాట్ కోహ్లీ సిక్సర్ కొడుతున్న ఫోటోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఈరోజు రాత్రి అంపైర్ సోదరులకు ఇది ఫుడ్ ఫర్ థాట్ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక మరి కొంతమంది మాజీ ఆటకాళ్లు కూడా విరాట్ కోహ్లీ చెప్పగానే నోబాల్ ఎలా ఇస్తారు.. రివ్యూలో చూడాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ బౌల్ద్ అయిన తర్వాత డెడ్ బాల్ గా ప్రకటించాలి. గానీ మూడు పరుగులు ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: