ఇప్పటికే పురుషుల క్రికెట్ తో పోల్చి చూస్తే అటు మహిళల క్రికెట్ కాస్త వెనకబడి ఉంది అని ఎంతో మంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పురుషుల క్రికెట్ తో పోల్చి చూస్తే అటు మహిళల క్రికెట్ ను ప్రమోట్ చేయడానికి ఎలాంటి బ్రాండ్లు కూడా ముందుకు రావు. అంతే కాదు వారికి సదుపాయాలు కూడా అరకొర మాత్రమే ఉంటాయి. ఇక అంతట ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక బంగ్లాదేశ్లో మహిళల క్రికెట్ పరిస్థితి మాత్రం మరింత అద్వానంగా ఉండేది. కనీసం మహిళల క్రికెట్ జట్టుకు ఒక ప్రత్యేకమైన కోచింగ్ సిబ్బంది కూడా అందుబాటులో లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేకమైన కోచ్ లతో కాకుండా స్థానిక కోచ్ లతో ప్లేయర్లకు శిక్షణ ఇప్పించడం చేసేవారు. దీనిబట్టి ఇక అక్కడ మహిళ క్రికెట్ జట్టు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉండే కోచ్ ల పర్యవేక్షణలో బంగ్లాదేశ్ మహిళల జట్టు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోవడంతో ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. మహిళల క్రికెట్ జట్టు కోసం అనుభవజ్ఞుడైన విదేశీ కోచ్ ను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.


 బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా శ్రీలంక మాజీ ప్లేయర్ హసన్ తిలక రత్నే నియమితుడయ్యాడు. ఇక వచ్చే రెండేళ్ల కాలానికి బంగ్లాదేశ్ కోచ్గా విధులు నిర్వహించబోతున్నాడు అన్న విషయాన్ని ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఇక తిలక రత్నే ఈ ఏడాది నవంబర్ నుంచి బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే  ఆరు మ్యాచ్లో కేవలం రెండే  విజయాలు సాధించి అయిదవ స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: