ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎంత ఉత్కంఠ భరితమైన పోరు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకానొక దశలో బంగ్లాదేశ్ గెలిచినంత పని చేసింది అని చెప్పాలి. ఇలా ఎంతో పటిష్టంగా ఉన్న టీమ్ ఇండియాను ముప్పు తిప్పలు పెట్టి చివరికి భారత్ చేతిలో ఓటమి చవిచూసింది బంగ్లాదేశ్ జట్టు. ఇలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా భారత్ ఉత్కంఠ పోరులో విజయం సాధించడం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కొంతమంది మాజీ ఆటగాళ్లు 2016లో వరల్డ్ కప్ లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరును ఇక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ నూ కూడా పోల్చి చూస్తూ ఉండడం గమనార్హం. 2016 వరల్డ్ కప్ సమయంలో ధోని సారథ్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఉత్కంఠ భరితమైన పోరులో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ధోని పాండ్యాకు బాల్ అందించడం చూశాను. నేను ఉత్కంఠ భరించలేకపోయాను.


 అప్పటికి బంగ్లా విజయానికి మూడు పరుగులే కావాలి. బంగ్లా టీమ్ అంతా ఒక్కచోట గుమ్మిగూడారు. నేను మాత్రం టాయిలెట్లోకి పరిగెత్తాను అంటూ రవి శాస్త్రి గుర్తు చేసుకున్నాడు. 2016లో టాస్ ఓడి బ్యాటింగ్ కూ దిగిన భారత్ 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో 11 పరుగులు అవసరమైన వేల మ్యాచ్ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇక చివరి బంతికి ముస్తాఫిజూర్ నూ ధోని రనౌట్ చేయడంతో బంగ్లా జట్టు కేవలం 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఒక పరుగు తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ఈ విషయాలను గుర్తు చేసుకున్నాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: