
ఇక అది మొదలు వికెట్లు వరుసగా కోల్పోయి చివరికి ఆ స్కోర్ తో సరిపెట్టుకుంది. వాస్తవంగా ఇంకా తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది, కానీ ఓపెనర్ రవికుమార్ సమర్థ్ నిలకడగా ఆడుతూ జట్టుకు ఒక మంచి స్కోర్ ను అందించడానికి ప్రయత్నించి చివరికి 88 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇతని తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారిలో బౌలర్ ఆల్ రౌండర్ మనోజ్ బందగే 22 పరుగులతో నిలిచాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న మనీష్ పాండే కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ ఉనద్కట్ 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు.
ఛేదనలో సౌరాష్ట్ర ఆరంభంలోనే ఓపెనర్లు డక్ అవుట్ అయినా జయ గోహిల్ (61) , సమర్థ్ వ్యాస్ (33) మరియు మన్కడ్ (35) లు సమర్థవంతంగా కర్ణాటక బౌలర్లను ఈదుకొని మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి అయిదు వికెట్లతో విజయాన్ని అందుకుని ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీఫైనల్ లో అస్సాం పై మహారాష్ట్ర 12 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. డిసెంబర్ 2 వ తేదీన సౌరాష్ట్ర మరియు మహారాష్ట్ర ల మధ్యన విజయ్ హజారే ట్రోఫీ లో ఫైనల్ జరగనుంది.