స్వింగ్ సుల్తాన్ గా పేరు గాంచిన పాకిస్తాన్ ఫేసర్ వసీం అక్రమ్ తాజాగా తన జీవిత కథను బయో పుస్తకం గా రాసుకున్నాడు. దాని పేరు సుల్తాన్.. ఏ మేమెయిర్ .. దీంట్లో భారత దేశంలోని చెన్నై తో ఉన్న తన ప్రత్యేక అనుబంధాన్ని తెలుపుతూ తన జీవితంలో జరిగిన అత్యంత విషాద సంఘటన కూడా రాసుకున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వసీం అక్రమ్ తెలియజేస్తూ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.

అసలు విషయంలోకి వెళితే.. దాదాపు 13 ఏళ్ల క్రితం వసీం అక్రమ్ తన భార్య హ్యూమా అక్రమ్ తో కలిసి సింగపూర్ వెళ్తున్నాడు. దారిలో ఇంధనం నింపుకోవడానికి విమానం చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ సమయంలో హ్యూమా అక్రమ్ కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ చేయించడానికి సింగపూర్ వెళుతున్న సమయంలోనే చెన్నైలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో ఇండియాకు సంబంధించిన వీసాలు తనకు తనకు మరియు భార్యకు లేవని, ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురవడంతో అనుమతులు లేకుండా ఎలా చేయించుకోవాలో తెలియక ఎయిర్ పోర్ట్ లోనే బోరును వినిపించాడట వసీం అక్రమ్.

కానీ చెన్నై ఎయిర్ పోర్ట్ సిబ్బంది తనను గుర్తుపట్టి తనకు మనో ధైర్యం ఇచ్చారని, వీసాల సంగతి మేము చూసుకుంటాం మీరు చికిత్స చేయించుకోండి అంటూ ఆసుపత్రికి పంపించారని తెలిపారు. ఒక పాకిస్తానీ అయినా కూడా నా పైన భారత ఎయిర్ పోర్ట్  అధికారులు చూపించిన అభిమానాన్ని తను ఎప్పటికీ మరిచిపోనని గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తిగా చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు చూపించిన మానవత్వం చాలా గొప్పదంటూ కొనియాడారు వసీం అక్రమ్. ఇక హ్యుమా ఆ తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రిలోనే వైద్యం తీసుకుంటూ కన్ను మూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: