తెలంగాణ మున్సిపల్  ఎన్నికల ఫలితాలలో అటు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ మధ్య  ఉత్కంఠత కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల తుది ఫలితాలు వెలబడ్డాయి. 136 కౌంటింగ్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు లెక్కింపు కూడా పూర్తి అయింది. అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ,బిఆర్ఎస్ పార్టీలు సత్తా చాటుతున్నాయి.. ఇటువంటి తరుణంలోనే అటు జనసేన పార్టీ, టిడిపి పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలవడం గమనార్హం. మరి వారు ఏ ఏ మున్సిపాలిటీలో గెలిచారు చూద్దాం.


ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10 వ వార్డును టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ టిడిపి అభ్యర్థిగా బోడేపూడి రేవతి విజయాన్ని అందుకున్నారు. పదవ వార్డులో 530 ఓట్లు పోల్ కాగా అందులో రేవతికి 334 ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా మధిర మున్సిపాలిటీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం. అక్కడ మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండక కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల విజయాన్ని అందుకుంది.


ఇక తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలలో 200 కు పైగా స్థానాలలో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఎట్టకేలకు బోణీ లభించింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో పోటీ చేసిన జనసేన పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తెలంగాణ గడ్డపై మున్సిపాలిటీ ఎన్నికల బరిలో జనసేనకు ఇది కీలక విజయంగా భావిస్తున్నారు జనసేన పార్టీ నేతలు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో  పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొంటారని వార్తలు వినిపించగా ,కానీ కొన్ని కారణాల చేత పాల్గొనలేకపోయినప్పటికీ, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసినటువంటి కృషి ఈ ఈ విజయానికి కారణం అయిందని చెబుతున్నారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీని మరింత బల్ల పరచడానికి చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక ఆరంభం అని కూడా చెబుతున్నారు. మరి రాబోయే ఎన్నికలలో భాగంగా జనసేన టిడిపి కూటమిగా చేరి తెలంగాణలో కూడా ఎన్నికలలో పోటీ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: