ఈ మధ్యకాలంలో ఎక్కువగా హర్రర్ , థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో కొన్ని మొదట ఓటీటిలో విడుదలై సక్సెస్ అయితే చాలు సీక్వెల్స్ అన్నీ కూడా థియేటర్లలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా హర్రర్ , థ్రిల్లర్ సినిమాలలో నటిస్తున్న నవీన్ చంద్ర గురించి చెప్పాల్సిన పనిలేదు.. 28 డిగ్రీ సెల్సియస్, షో టైమ్, లెవేన్ తదితర చిత్రాలతో అలరించారు. అయితే ఇటీవలే నటించిన మరో హర్రర్ థ్రిల్లర్ చిత్రం హనీ. పిల్లి మాయ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ కూడా అందరిని ఆసక్తిపరిచేలా చేసింది.


దీంతో విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్, స్టోరీ బాగానే ఉన్న, ఎక్కువగా వైలెన్స్ ఉండడం కొన్ని సీన్స్ గందరగోళంగా అనిపించడంతో ఈ సినిమాకి మైనస్ గా మారింది. అయితే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఐఎండిబి లో రేటింగ్ పరంగా 7.9  రేటింగ్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమా ఓటీటిలోకి రాబోతోంది. హనీ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.


సినిమా ఫిబ్రవరి 27 నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలైన నెలలోపే ఈ సినిమా ఓటీటిలోకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించగా దివ్య పిళ్లై ,రాజా రవీంద్ర తదితర నటీనటులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా మదనపల్లిలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరి ఓటీటిలో ఎలాంటి ఆదరణ రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: