ఇటీవల ఆమె నటించిన భారీ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రేజ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత శ్రీ లీల కెరీర్ మరింత వేగంగా ముందుకు దూసుకుపోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొంతకాలంగా ఒక బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ఇది సరైన బ్రేక్ ఇవ్వగల చిత్రంగా భావిస్తున్నారు. ఇంతలోనే మరో మెగా ప్రాజెక్ట్‌లో కూడా శ్రీ లీలకు అవకాశం దక్కిందనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాలో ఆమెకు ప్రత్యేక పాత్ర ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ, కథలో కీలకమైన కూతురు పాత్ర కోసం ముందుగా కృతి శెట్టి పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రకు శ్రీ లీల మరింత సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్, ఆ ఆఫర్‌ను ఆమెకు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇది ఖరారైనట్లే అన్న ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం నిజమైతే, ఇది శ్రీ లీల కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూతురు పాత్రలో మెప్పించిన ఆమె, ఇప్పుడు చిరంజీవి చిత్రంలో కూడా అలాంటి బలమైన పాత్రలో కనిపించే అవకాశముంది. ఒకవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూ, మరోవైపు కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడం ద్వారా ఆమె తన నటన వైవిధ్యాన్ని నిరూపిస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల కెరీర్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది అని చెప్పవచ్చు. గ్లామర్‌తో పాటు గ్రేస్, విద్యతో పాటు వినయం .. ఈ లక్షణాలన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. హీరోయిన్‌గా తన కలలను సాకారం చేసుకుంటూనే, డాక్టర్‌గా తన బాధ్యతను కూడా నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్న శ్రీ లీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే ఇప్పటివరకు ఆమె చూపిన కృషి, ఎంపిక చేసుకుంటున్న ప్రాజెక్టులు చూస్తే, ఆమె పేరు ఇంకా ఎన్నో సంవత్సరాలు టాలీవుడ్‌లో మార్మోగడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి