వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టబోయే రెండో జట్టు ఏది అన్న విషయంపై ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇక పాయింట్ల పట్టిక చూసుకుంటే ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక భారత్ కంటే కొన్ని పాయింట్లు మాత్రమే తక్కువగా ఉండడంతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇక ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి.



 అయితే ఇక ఇప్పుడు ఫైనల్లో అడుగుపెట్టబోయే రెండో జట్టు ఏది అన్న విషయంపై  చర్చ జరుగుతుంది. అయితే ఇక ఇటీవల మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడంతో శ్రీలంక జట్టులో ఆశలు చిగురించాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఒక సువర్ణ అవకాశం లభించింది అంటూ లంక క్రికెటర్లు సంబరపడిపోతున్నారు. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగు పెట్టాలంటే టీమిండియ నాలుగో మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. మూడో మ్యాచ్లో పుంజుకున్న ఆస్ట్రేలియా నాలుగో మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే దానిపై కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు విశ్లేషకులు.



 ఇక ఈ విషయంపై శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మాథ్యూస్.. మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ చేరాలి అంటే మాకు ఒకే ఒక్క మార్గం ఉంది.. న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ ను ఓడించడమే.  కానీ అది అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే గత పర్యటన లో మేము మెరుగైన ప్రదర్శన కనపరచడం సానుకూల అంశం అని చెప్పాలి. కానీ గెలవాలంటే న్యూజిలాండ్ ను దెబ్బకొట్టే వ్యూహాలను అమల్లోకి తీసుకురావాలి. న్యూజిలాండ్ ను వారి సొంత దేశంలో ఓడించడం అంటే కఠినమైన సవాలు. అయితే ఈ విషయంలో మేము ఎలాంటి ఒత్తిడికి  లోను కావడం లేదు. ఫైనల్ చేరాలంటే మా ముందున్న ఏకైక మార్గం రెండు మ్యాచ్లలో గెలవడమే. అందుకోసం మేము అత్యుత్తమ ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది అని మ్యాథ్యూస్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: