వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇండియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఇక ఇలా ఫైనల్ అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలిచింది. అయితే ఇక ఇప్పుడు ఇక ఇలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో భారత జట్టు మూడవ స్థానంలో శ్రీలంక జట్టు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏది డబ్ల్యూటీసి ఫైనల్లో అడుగుపెడుతుంది అన్నది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 డబ్ల్యూటీసి  ఫైనల్ లో అడుగుపెట్టేందుకు అటు భారత జట్టు ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండగా మరోవైపు అటు శ్రీలంక జట్టు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పట్టు బిగిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయి 162 పనులు మాత్రమే చేస్తుంది. ఒక రకంగా శ్రీలంక బౌలర్లు అందరూ కూడా దుమ్ము రేపుతున్నారు అని చెప్పాలి. లంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టేస్తూ ఉన్నారు.


 ఒకవేళ మొదటి మ్యాచ్లో శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ పై పడుతుంది. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన లేకపోతే మ్యాచ్ డ్రాగ ముగించిన గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెడుతుంది టీమ్ ఇండియా. ఒకవేళ ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలు అయితే మాత్రం శ్రీలంక గెలుపు ఓటములపై ఇక అటు టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. శ్రీలంక ఒకవేళ న్యూజిలాండ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే అప్పుడు లంక డబ్ల్యూటిసి ఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. ఇక ఒక్క మ్యాచ్లో ఓడిన కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు లంక జట్టుకు గల్లంతయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: