
భారత జట్టుకు స్పిన్ విభాగానికి కోచ్ గా సేవలు అందిస్తాను అని నేను రాహుల్ ద్రావిడ్ ను అడిగితే అతను తిరస్కరించాడు అంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చెప్పుకొచ్చాడు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక కారణం కూడా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు 2-1 తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.. ఇక మూడో వన్డేలో భారత్ స్పిన్నర్లు పూర్తిగా విఫలం అయ్యారు. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్లు మాత్రం అటు భారత బ్యాట్స్మెన్లను తెగ ఇబ్బంది పెట్టేశారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ స్పందిస్తూ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ సరైన ఫీల్డింగ్ సెట్ చేయలేదని అనిపించింది. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుంటే కెప్టెన్ స్మిత్ మాత్రం అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేసి వికెట్లు సాధించాడు. దీనిపై మీరేం అంటారు అంటూ మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ని ట్యాగ్ చేశాడు. దీనిపై ఆయన స్పందిస్తూ టీమ్ ఇండియా స్పిన్ విభాగానికి కోచ్గా ఉంటూ సలహాలు సూచనలు అందిస్తానని నేను అడిగితే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించలేదు అన్న విషయాన్ని వెల్లడించాడు ఆయన. మీరు నాకంటే సీనియర్ అని ద్రవిడ్ నాతో అన్నారు అంటూ ఇక నేటిజన్ ప్రశ్నకు పొంతనలేని సమాధానం చెప్పాడు.