సినీ ఇండస్ట్రీలో కచ్చితంగా హీరోలకు ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఉండనే ఉంటుంది. ముఖ్యంగా హీరోల బర్తడే, సినిమాలు విడుదలైన సమయాలలో ఫాన్స్ చేసే హంగామా చెప్పాల్సిన పనిలేదు. అలా అల్లు అర్జున్ కి ప్రత్యేకించి ఫ్యాన్స్ అసోసియేషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏర్పడింది. తాజాగా హైదరాబాదులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఐదు గంటల పాటు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


రాబోయే రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో అటు జిల్లాల మండల టౌన్ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను ప్రారంభించారు. అలాగే ఈ సమావేశంలో ఎంచుకున్న ప్రతినిధులలో వారి యొక్క బాధ్యతలను వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే చేపట్టిన కార్యక్రమాలకు కూడా సమర్థవంతంగా క్రమబద్ధంగా నిర్వహించేలా ఉండాలని తెలియజేశారు. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు , జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అల్లు ఫాన్స్ అసోసియేషన్ ద్వారా భవిష్యత్తులో పలు సేవా కార్యక్రమాలను  ప్రజల ముందుకు తీసుకు వెళ్లడానికి ఈ కమిటీ కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటూ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు.


ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ప్రతిభ క్రమశిక్షణను విలువలను సైతం ప్రతిబింబించే విధంగా ఫాన్స్ అసోసియేషన్ పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గ్రూప్ ను కూడా మైంటైన్ చేయబోతున్నట్లు తెలియజేశారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించగా భారీ బడ్జెట్లోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఒక సినిమా , సుకుమార్ తో పుష్ప 3 సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: