
ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న రహనే 15 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ టీం ఇండియా టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రహానే ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయడం దాదాపు ఖాయమైపోయింది అని చెప్పాలి. అయితే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా.. శ్రేయస్ సర్జరీ కారణంగా ఇక జట్టుకు దూరమయ్యారు. దీంతో తెలుగు క్రికెటర్ భరత్ కి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది.
అయితే టెస్ట్ ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టి20 బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ డబ్ల్యూటీసి ఫైనల్ కి ఎంపిక చేయకపోవడం పై అసంత వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. అజంక్య రహానే టెస్ట్ టీమ్ లోకి రావడం హ్యాపీగా ఉంది.. కానీ సూర్య కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదు.. ఒకే ఒక్క మ్యాచ్ అది కూడా ఒకే ఒక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని టెస్టుల నుంచి ఎందుకు తప్పించారు. ఈ మాత్రం దానికి అతని టెస్ట్ టీం కి ఎంపిక చేయడం దేనికి.. సెలెక్ట్ చేసిన తర్వాత సరైన అవకాశాలు ఇవ్వకుండా డ్రాప్ చేయడం దేనికి అంటూ సెలెక్టర్ల తీరిపై అగ్రహం వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా.