
ఎన్నో రోజులపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. తన ఆట తీరుతో తన కెప్టెన్సీ తో కూడా ఆకట్టుకున్నాడు. అయితే గత ఏడాది జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని వేలంలోకి వదిలేసింది. దీంతో అలాంటి అత్యుత్తమ ఆటగాడిని పోటీపడి మరి అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది అని చెప్పాలి. ఇక ఢిల్లీ జట్టు తరఫున విలియమ్సన్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూసారు.
కానీ ఇక కేన్ విలియమ్సన్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఫ్యాన్స్ అందరికీ నిరాశ ఎదురయింది. ఎందుకంటే గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయిపోయాడు కెన్ విలియంసన్. ఇకపోతే ఇటీవల అభిమానులు అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పాడు. తన సర్జరీ విజయవంతం అయింది అంటూ ఇంస్టాగ్రామ్ లో ప్రకటించాడు కేన్ విలియమ్సన్. అంతేకాకుండా రిహాబిలేషన్ ను తన ఇంట్లో ప్రారంభించినట్లు ఒక ఫోటోను కూడా షేర్ చేశాడు. దీంతో అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్లు పెడుతున్నారు. దీని పై స్పందించిన కోహ్లీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పందించాడు. మరి కేన్ విలియమ్సన్ ఎప్పుడు క్రికెట్ కి అందుబాటులోకి వస్తాడో చూడాలి మరి.