ముంబై ఇండియన్స్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ మధ్య బుధవారం నాడు రాత్రి 7.30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ స్టార్ట్ కానుంది.ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ టీం ఘన విజయం సాధించడంతో సీఎస్కే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ముంబై, లక్నో మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే జట్టు శుక్రవారం నాడు రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ తో ఆడాల్సి ఉంటుంది. రెండో క్వాలిఫయర్ లో గెలిచే టీం ఆదివారం నాడు సీఎస్కేతో ఫైనల్ లో తలపడుతుంది.ముంబై ఇండియన్స్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం)లో మ్యాచ్ జరుగుతుంది. ఈ మైదానం స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంది. మొదట బ్యాటింగ్ కు దిగే జట్టు స్కోరు కనుక 165 పరుగులు దాటితే ఉత్తమ స్కోరనే చెప్పవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లేదా జియో సినిమాలో ఈ మ్యాచ్ ని చూడొచ్చు.


లక్నో టీం విషయానికి వస్తే.. క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహసిన్ ఖాన్ ఇంకా అవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లు ఆడనున్నారు.ఇక ముంబై టీం విషయానికి వస్తే..రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, కుమార్ కార్తికేయ, క్రిస్ జోర్డాన్, పీయూశ్ చావ్లా, జాసన్ ఇంకా ఆకాశ్ వంటి ప్లేయర్లు ఆడనున్నారు.ఇక చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ అయితే అంత ఈజీ కాదు. స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేవారు అయితే కొంచెం రాణించవచ్చు.అయితే సూర్యకుమార్ యాదవ్ రాణించే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ లో అతడు  మొత్తం 14 మ్యాచులు ఆడి 511 పరుగులు చేశాడు. అలాగే కుడిచేతి వాట లెగ్‌బ్రేక్ గూగ్లీ బౌలర్ రవి బిష్ణోయ్ రాణించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: