2023 ఐపీఎల్ సీజన్లో కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందో లేదో అని అనుమాన పడేలా ప్రస్థానాన్ని కొనసాగించింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ ప్రారంభం సమయంలో వరుస పరాజయాలతో సతమతమై విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. ఇక గత ఏడాది లాగానే పేలవ  ప్రదర్శన చేసి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండానే.. టోర్ని నుంచి నిష్క్రమిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ముంబై జట్టుకు అదృష్టం కలిసి వచ్చింది. నెగిటివ్ రన్ రేట్  ఉన్నప్పటికీ.. ముంబై జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది.


 ఇటీవల లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఏకంగా 81 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని సాధించి రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. కాగా నేడు అటు గుజరాత్ టైటాన్స్ తో రెండో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోవాలని పట్టుదలతో ఉంది. కాగా రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం ఇటీవల ముంబై జట్టు ఫ్లైట్లో బయలుదేరింది. అయితే ఇక ఇలా అందరూ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో ముంబై ప్లేయర్ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ  విండో సీట్ దగ్గర కూర్చుని హాయిగా నిద్రపోయాడు. ఇలాంటి సమయంలోనే సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మను టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టస్ ను ఒక నిమ్మకాయ అడిగి.. దాని జ్యూస్ ను నిద్రపోతున్న తిలక్ వర్మ నోటిలో పిండాడు. దెబ్బకు లేచి కూర్చున్న తిలక్ వర్మ ఏంటిది అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీంతో ఇక ఇదంతా గమనిస్తున్న తోటి టీమ్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: